శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు అసలు నచ్చవు: సందీప్ రెడ్డి వంగా

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎపిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు తనకు అసలు నచ్చవని స్పష్టం చేశారు. అయితే ఆయన చిత్రాల్లో హీరోయిన్ల పాత్రల డిజైనింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. టీజర్‌లోని ఓ డైలాగ్ ఆధారంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.