తెలంగాణ రైతులకు గూగుల్ ప్రత్యేక వరి సాగు సాయం

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనకు మద్దతుగా గూగుల్ ఐదు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని సన్నకారు వరి రైతులకు సహాయపడేందుకు మిట్టి ల్యాబ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ సాంకేతికత ద్వారా వరి సాగులో మీథేన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు నేరుగా చెల్లింపులు అందించనుంది.