ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయాలని అంబటి లక్ష్మణ్ పిలుపు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జన్నారం మండల అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్ కోరారు. శనివారం జన్నారం మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులతో కలిసి హైదరాబాదులో నిర్వహించే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని వెల్లడించారు.