బాపట్ల జిల్లాలో కుంగిన రెగ్యులేటర్.. గట్టు కోతకు గురి!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద రేపల్లె మెయిన్ డ్రెయిన్ రెగ్యులేటర్ భూమిలోకి కుంగిపోయింది. షట్టర్లు దించడంతో భారీగా చేరిన నీటి ఉద్ధృతికి డ్రెయిన్ కట్టలు కోసుకుపోయి రెగ్యులేటర్ మూడడుగుల మేర కుంగింది. ఎడమ కట్టపై ఉన్న పంపుషెడ్డు కొట్టుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు మండిపడుతున్నారు. కట్టల బలోపేతానికి తక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.