ఫౌజీ షూటింగ్ లో రాజేష్ శర్మ ఆరోగ్యంపై క్లారిటీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర షూటింగ్ సమయంలో విషపురుగు కుట్టి బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తన అనారోగ్యానికి సినిమా యూనిట్ కారణం కాదని, డయాబెటిస్ కారణంగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకిందని స్పష్టం చేశారు.