స్థానిక ఎన్నికల్ లో వైకాపా ఘోర ఓటమి: మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్ లో వైకాపాను ప్రజలు మరోసారి తిరస్కరించారని మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల్ లో తెలుగుదేశం పార్టీ విజయపరంపర కొనసాగుతోందని ఆమె తెలిపారు. విజయనగరం, కడప మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతి, గుంటూరు, విశాఖ సహా పలు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని, ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి సవిత స్పష్టం చేశారు.