శాస్త్రీయ ఆలోచనలతో మూఢనమ్మకాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చిన వక్తలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలే–పెరియార్–అంబేడ్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో పెరియార్ 147వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు శాస్త్రీయ విద్య ఎంతో అవసరమని వక్తలు స్పష్టం చేశారు. మహనీయుల ఆశయాలను విద్యార్థులు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో గోడిసెల శ్రీహరి, సంకె రవి, రంగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.