స్థానిక సంస్థల ఎన్నికలు: పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పదమూడు వేల ఐదు వందల సీసీ కెమెరాలతో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అధికారులతో కలిసి ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ శాతాలను మాన్యువల్‌గా వెల్లడించినట్లు అధికారులు స్పష్టం చేశారు.