మణుగూరు ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి: ఖమ్మం రీజియన్ బంద్ కు జేఏసీ పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: మణుగూరు

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఆమె మృతి కార్మిక వర్గాల్ లో తీవ్ర విషాదాన్ని నింపిందని, ఈ ఘటనకు నిరసనగా ఖమ్మం రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోలను బంద్ చేయాలని పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఈ బంద్ నేపథ్యంలో బస్సుల రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రయాణికులు తగిన సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు.