అమెరికాలో అరుదైన ఘటన: లైబ్రరీలోకి ప్రవేశించి తేనె జాడీని లాగేశిన ఎలుగుబంటి
రిపోర్టర్: గోపి
స్థలం: California
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఒక లైబ్రరీలోకి ఉదయాన్నే నల్లటి ఎలుగుబంటి ప్రవేశించి కలకలం సృష్టించిందని మోనో కౌంటీ ఫ్రీ లైబ్రరీస్ అధికారులు వెల్లడించారు. సరిగ్గా మ్యామోత్ లేక్స్ బ్రాంచ్ లైబ్రరీ తెరుచుకోకముందే లోపలికి చొరబడిన ఆ వన్యప్రాణి సిబ్బంది ఉంచుకున్న స్నాక్స్, తేనె జాడీని లాగేశిందని వారు తెలిపారు. విన్నీ ది పూహ్ కార్టూన్ పాత్ర వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజే ఈ ఘటన జరగడం విశేషమని లైబ్రరీ డైరెక్టర్ జోసెఫ్ బాప్ పేర్కొన్నారు.