డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశాల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మ నాయక్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు వివిధ పీజీ, డిప్లొమా మరియు కొత్త ఆన్లైన్ కోర్సులకు అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్లైన్ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్ను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.