హైదరాబాద్‌లో సందీప్ కిషన్ సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ సిగ్మా చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో గురువారం జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.