డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియపై ఆయన విషం కక్కడం బాధాకరమని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే జగన్ యత్నిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.