డోన్ పుర పీఠం కైవసం చేసుకున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

రిపోర్టర్: కిరణ్ స్థలం: డోన్

డోన్ మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపులో తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. వైకాపా అభ్యర్థి బి.చైతన్యపై ముైై ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారని చెప్పారు. పుర పీఠంపై తెదేపా జెండా ఎగిరిందని, కౌన్సిలర్ స్థానాలలో తెదేపా పదహారు, వైకాపా పదిహేను స్థానాలు గెలుచుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారని వారు వివరించారు.