జూరాల ప్రాజెక్ట్ నీటి విడుదలపై రేవంత్ సర్కార్‌కు డెడ్‌లైన్

రిపోర్టర్: హరి స్థలం: Mahabubnagar

జూరాల ప్రాజెక్ట్ నీటి విడుదల కోసం రైతులు చేపట్టిన చలో జూరాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆరు గంటల పాటు సాగిన ఈ నిరసనలో పోలీసులు బలప్రయోగం చేసి రైతులను చెదరగొట్టారు. వరద నీటిని ఎత్తలేక పంటలను ఎండిపోయేలా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విడుదలపై సర్కార్‌కు రైతులు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు.