గుండె ఆరోగ్య పరిరక్షణపై కావలిలో ఘనంగా అవగాహనా సదస్సు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కావలి
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కావలిలోని జవహర్ భారతి క్రీడా ప్రాంగణంలో గుండె ఆరోగ్య పరిరక్షణ అవగాహనా సదస్సును నిర్వహించారు. ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఏ. ఉమాచంద్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వెల్లడించారు. విశ్వోదయ రెక్టార్ డి. వినయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన కంచంలో ఉండే ఆహార పదార్థాలను బట్టి రేపటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2కె మారథాన్ వాక్ నిర్వహించి, ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు.