వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచి రోదిస్తున్న జనం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మహ్మదాబాద్ మీదుగా రోటి గూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బండేరా వాగు చిన్న వర్షానికే ఉప్పొంగుతోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడవుతుందో, తమ ప్రయాణ ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయోనని వారు వాపోతున్నారు.