బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ కొత్త సినిమా చర్చలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ముంబైలో రహస్యంగా భేటీ అయ్యారు. వీరితో పాటు స్క్రీన్ రైటర్ అరుణ్ అనిరుధన్ కూడా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అల్లు అర్జున్ 24వ సినిమా వీరి కాంబినేషన్‌లోనే ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.