అద్భుతం: ప్రపంచంలోనే తొలిసారి ఎలుగుబంటికి కృత్రిమ కాలు అమర్పు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bannerghatta
బన్నేరుఘట్ట అభయారణ్యంలో వాసి అనే ఎలుగుబంటికి ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ కాలును అమర్చినట్లు వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ సంస్థ వెల్లడించింది. అడవిలో వైర్ ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వాసికి రక్షణ కల్పించి, ఇన్ఫెక్షన్ సోకడంతో కాలును తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ యానిమల్ రెస్క్యూ మరియు నిపుణుల సహకారంతో ప్రత్యేక కృత్రిమ పాదాలను తయారు చేసి అమర్చడంతో, వాసి ఇప్పుడు సాధారణంగా నడుస్తూ తన సహజమైన విధులను నిర్వర్తిస్తున్నట్లు నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.