పాలకొండ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నూతన చైర్పర్సన్ విజయనిర్మల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పళ్ల విజయనిర్మల తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాలకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలతో పాటు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.