నా క్రికెట్ బ్యాట్‌తో ఉన్న అనుబంధం మరువలేనిది: సచిన్ టెండూల్కర్
రిపోర్టర్: సునీల్
స్థలం: India
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రీడా జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. బ్యాట్ అనేది కేవలం పరికరం కాదని, దానిని తన చేతుల్లోకి తీసుకున్న క్షణంలో కలిగే అనుభూతి ప్రత్యేకమని తెలిపారు. తాను ఆడే రోజుల్లో స్వయంగా కార్పెంటరీ కిట్‌తో బ్యాట్‌కు మెరుగులు దిద్దుకున్న క్షణాలను గుర్తుచేసుకుంటూ, ఆ జ్ఞాపకాలు తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని భావోద్వేగ పోస్ట్ చేశారు.