ఖమ్మంలో ఈనెల 28న నిధి ఆప్కే నికట్ కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఈనెల 28న నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, యజమానులు, పెన్షనర్లు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.