వర్ధన్నపేటలో మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం శ్రీ దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీ మరియు వేదమంత్రోచ్ఛారణలతో కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.