జగనన్న వెంటే ఉంటాం: గోవాడ రైతులు స్పష్టం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
జి.కె.వీధి మండలంలో గోవాడ రైతులు తాము ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తమకు జనసేన నాయకులు బలవంతంగా పార్టీ కండువాలు కప్పారంటూ వారు తీవ్రంగా ఆరోపించారు.
టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారిని వైసీపీ నుంచి వచ్చినట్లు తప్పుగా ప్రకటించడం సరికాదని వైసీపీ మండల అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్ ఖండించారు. ప్రజా సమస్యలపై మరియు ఎన్నికల హామీల అమలుపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.