ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద ఆందోళన

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో నగరంలో భద్రతా ఆంక్షలు విధించి మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.