ఏరువాడ గిరిజన గ్రామానికి రూ.10 కోట్లతో రోడ్డు మంజూరు చేసిన పవన్ కల్యాణ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అల్లూరి సీతారామరాజు

జనసేన వీరమహిళ మృదుల పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా అల్లూరి జిల్లాలోని మారుమూల ఏరువాడ గిరిజన గ్రామాన్ని సందర్శించి నిత్యావసరాలు పంపిణీ చేశారు. రోడ్డు సౌకర్యం లేక ఆమె పడిన కష్టాలను తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, 'అడవితల్లి బాట' కింద రూ.10 కోట్లతో రోడ్డు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.