విజయానికి నిధిగా ఎస్ఆర్ కళాశాల నిలుస్తోందన్న ప్రిన్సిపల్ కమటం రమేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆలేరు
ఆలేరు స్థానిక ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన కొల్లూరి రాజయ్య, సముద్రాల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ కమటం రమేష్ మాట్లాడుతూ ఎస్ఆర్ అంటే సక్సెస్ రిసోర్స్ అని, గతేడాది ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత మెరుగైన మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు.