పదవి పోయినా కాంగ్రెస్‌ను వీడేది లేదు: కొండా సురేఖ
రిపోర్టర్: రమేష్
స్థలం: Telangana
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అకారణంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే బాధ మాత్రమే ఉందని, పదవులు ఉన్నా లేకున్నా తాను, కొండా మురళి కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ కోసం పోరాటం చేస్తామని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.