దేశ విచ్ఛిన్న కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోదీ

రిపోర్టర్: గోపి స్థలం: ఏక్తానగర్

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. గుజరాత్ లోని ఏక్తానగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్ లో ఆయన మాట్లాడారు. భారత వ్యతిరేక శక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా అబద్ధాలను వ్యాప్తి చేస్తూ దేశంలో అస్థిరతను సృష్టించాలని కుట్రలు చేస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక రాజకీయాలు మాని అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మోదీ మండిపడ్డారు.