ఆళ్లగడ్డలో ఆత్మీయ కృతజ్ఞతా సభ: ప్రజల తీర్పును స్వాగతించిన భూమా అఖిల ప్రియ

రిపోర్టర్: హరి స్థలం: నంద్యాల

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞతా సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో తనకు అఖండ విజయం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.