అమరావతి రైతన్నలకు తీపి కబురు: ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పూర్తి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నూట ముప్పై ఎనిమిది మంది రైతులకు రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఈ-లాటరీ విధానం ద్వారా నూట అరై మూడు రిటర్నబుల్ ప్లాట్లను అధికారులు కేటాయించినట్లు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ వెల్లడించారు. రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ నిర్వహించి ప్రత్యక్ష లాటరీ తీశారు.