బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఇంటిపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఇంటి గేట్ తలుపులు పగులగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ దౌర్జన్యానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరాచక చర్యలకు దిగుతోందని మండిపడింది. కక్షసాధింపు రాజకీయాలతో భయపెట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేకత తప్పదని బీఆర్ఎస్ హెచ్చరించింది.