వేల కోట్ల భూ దోపిడీ: రంగారెడ్డి జిల్లాలో విల్లాల నిర్మాణాల కలకలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలో వేయి కోట్ల రూపాయల విలువైన ముప్పై మూడు ఎకరాల లావణి భూములు ప్రైవెట్ వ్యక్తుల పాల్లయ్యాయని మంఖాల్ గ్రామస్తులు మరియు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకున్నా విల్లాల నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు మండిపడ్డారు. ఈ భారీ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు తెలంగాణ భవన్లో డిమాండ్ చేశారు.