'నన్ను ఎవరూ మోసం చేయలేరు': లాయర్లపై సీన్ డిడ్డీ కామ్స్ ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: అమెరికా

అమెరికా ప్రముఖ రాపర్ సీన్ డిడ్డీ కామ్స్ వంద మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా కేసు నుంచి తన లాయర్ల బృందం తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు భారీగా ఫీజులు చెల్లించకపోవడంతో పాటు ఆయన నుంచి ఎలాంటి సహకారం అందలేదని లాయర్ మైఖేల్ ట్రెమోంటే కోర్టుకు తెలిపారు. అయితే అనవసరమైన బిల్లులు వేసి తనను మోసం చేయాలని చూస్తే ఊరుకోనని, అందుకే తాను లాయర్లను మార్చుకున్నానని డిడ్డీ స్పష్టం చేశారు.