నివాస రుజువుగా రేషన్ కార్డు ఆధార్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలకు రేషన్ కార్డు, ఆధార్‌నే నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీవీటీజీ కుటుంబాల వారికి ఆధార్ నమోదు కోసం మాత్రమే తహసీల్దార్లు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని పేర్కొన్నారు.