నిరుద్యోగులకు గుడ్ న్యూస్: యూకేపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: డెహ్రాడూన్
ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది నగరాల్ లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 13 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మొదటి పేపర్ ఉదయం పూట, రెండో పేపర్ మధ్యాహ్నం సమయంలో జరుగుతుందని వెల్లడించారు.