బొత్స సొంతగడ్డపై వైకాపాకు భారీ షాక్ పెద్ద ఎత్తున నేతల రాజీనామాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: చీపురుపల్లి

చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరులు ప్రకటించారు. మెరకముడిదాం మండలంలో వైకాపా మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు పదమూడు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను పార్టీ అధినేత జగన్కు పంపుతున్నట్లు వారు స్పష్టం చేశారు. చిన్న శ్రీను బాటలోనే నడుస్తామని, త్వరలోనే తెదేపాలో చేరతామని రాజీనామా చేసిన నాయకులు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.