టీమిండియా కోచ్‌ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆశిష్ నెహ్రా

రిపోర్టర్: రాము స్థలం: భారత్

భారత జట్టు కోచ్‌గా వ్యవహరించడం గౌరవమే అయినప్పటికీ తనకు ఎలాంటి ప్రత్యేక ఆశయాలు లేవని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కోచ్‌గా అవకాశం వస్తే భార్యను అడగాలని, లేదంటే ఆమె విడాకులు ఇస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడాదిలో ఎనిమిది నెలలు ప్రయాణాలు చేయడం కష్టమని, ప్రస్తుత పొజిషన్‌లోనే సంతోషంగా ఉన్నానని నెహ్రా తేల్చిచెప్పారు.