హైదరాబాద్లో ప్రయాణికులకు భారీ ఊరట: నూతన మెట్రో ఆర్టీసీ కామన్ పాస్లు ఖరారు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం నూతన కామన్ పాస్ ధరలను హాయ్ హైదరాబాద్ వెల్లడించింది. దీని ప్రకారం నెలవారీ కామన్ పాస్ ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా ఉండగా, అందులో మెట్రోకు ఏడు వేలు, ఆర్టీసీకి వేయి ఐదు వందలు కేటాయించారు. అలాగే దినసరి కామన్ పాస్ ధర నాలుగు వందల రూపాయలుగా నిర్ణయించగా, అందులో మెట్రోకు మూడు వందలు, ఆర్టీసీకి వంద రూపాయలు వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.