కాగ్నిజెంట్, క్లౌడెరాకు గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్‌లో భారీ ఎదురుదెబ్బ!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమెరికా

అమెరికాలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, డేటామేనేజ్‌మెంట్ దిగ్గజ సంస్థ క్లౌడెరాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్ కార్డుకు అవసరమయ్యే శాశ్వత లేబర్‌ సర్టిఫికేషన్‌ ఫైలింగ్స్‌ను యూఎస్‌ కార్మికశాఖ నిలిపివేసింది. వైట్‌హౌజ్‌ ఫ్రాడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి ఈ సంస్థలపై దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంథోని వెల్లడించారు. ఉద్యోగులకు ముప్పు వాటిల్లితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.