బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికీ పనికిరారు: సామ రామ్మోహన్ రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికి పనికిరారని కాంగ్రెస్ సీనియర్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటీవీ జబర్దస్త్‌తో పోటీపడుతున్న డ్రామా రావు సెట్టు, స్కిట్టు అంటూ విమర్శించారు. పగటి వేషగాళ్ల వల్ల రాష్ట్రానికి జీరో లాభం మాత్రమేనంటూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.