ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమి నేతలు
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు దాఖలైన ఈ పిటిషన్లో సర్ ప్రక్రియపై స్టే విధించాలని కోరడంతో పాటు పది కీలక విజ్ఞప్తులు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.