బెంగళూరు డీఆర్డీవో కేంద్రంలో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: శివ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పరిధిలోని మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న మూడు జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈఈఈ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ లేదా గేట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించగా, నిబంధనల ప్రకారం రిజర్వుడ్ వర్గాలకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల స్టైపెండ్‌తో పాటు హెచ్‌ఆర్ఏ చెల్లిస్తారు. అక్టోబర్ 15, 2026 న బెంగళూరులోని ఎంటీఆర్‌డీసీ రిసెప్షన్ వేదిక వద్ద ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.