సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మనుబోలులో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి భౌతికకాయానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వయంగా పాడి మోసి కడచూపుల నివాళి అర్పించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.