మూలపాడు వేదికగా రంజీ మ్యాచ్ డ్రా: ఆకట్టుకున్న ఆంధ్ర మరియు కర్ణాటక ఆటగాళ్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: NTR District
ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య మూలపాడు వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ డ్రాగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. నాలుగో రోజు ఆటలో కర్ణాటక తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది. కరుణ్ నాయర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఆంధ్ర బౌలర్లలో మోహన్ ఐదు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఆంధ్ర నాలుగు వికెట్లకు నూట నాలుగు పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.