పాఠశాలల్ లో వరుస దాడుల కలకలం: సినిమా ప్రభావంపై పెరుగుతున్న చర్చ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనంతపురం

పాఠశాలల్ లో ఇటీవల జరిగిన ఘోరమైన దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. హేమంత్ అనే యువకుడు రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై గొడ్డలితో దాడి చేసిన ఉదంతం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ దాడులకు హింసాత్మక సినిమాలే కారణమనే వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతపై సోషల్ మీడియా, వీడియో గేమ్లు, మారుతున్న సామాజిక పరిస్థితుల ప్రభావం కూడా అధికంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.