బియ్యం ధరల నియంత్రణకు సర్కార్ కొరడా: గరిష్ట ధరలు ఖరారు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
బియ్యం ధరలను నియంత్రించేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ తనిఖీలను ముమ్మరం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్రమ నిల్వలు మరియు కృత్రిమ కొరత సృష్టిస్తున్న రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో సమావేశమై గరిష్ట ధరలను ఖరారు చేశామన్నారు. బీపీటీ కిలో రూ.66 మించకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.