భూముల రీ సర్వేతో వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడి

రిపోర్టర్: మహేష్ స్థలం: నిర్మల్

భూముల రీ సర్వే ద్వారా ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో రైతులు, గ్రామస్తులతో సమావేశమైన ఆయన రీ సర్వే పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. అలాగే పదో తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని సూచిస్తూ లెఫ్ట్ పోచంపాడ్లోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు.