కుప్పంలో నూతన రైతు బజార్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రిపోర్టర్: వెంకట్ స్థలం: చిత్తూరు

కుప్పం బైపాస్ వద్ద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రైతు బజార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మల్టీ ఫ్లోర్లతో కూడిన ఈ భవనాన్ని ఆరు నెలల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీ, వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని సూచించారు.