అమెరికా వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ టెకీలకు భారీ షాక్

రిపోర్టర్: గోపి స్థలం: Washington

అమెరికాలో హెచ్-1బీ మరియు ఎల్-1 వీసాల పొడిగింపు ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెచ్చిందని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల ఎక్కువశాతం మంది భారతీయ టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రతి వీసా పొడిగింపు దరఖాస్తును కొత్త పిటిషన్గా పరిగణించి మొదటి నుంచి పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని డీహెచ్ఎస్ పేర్కొంది.